విశాఖపట్నం-విజయనగరం హైవే
రక్తమోడింది. విజయనగరం జిల్లా సుంకరపేట వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత
పడ్డారు. గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ
బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలండర్ల లారీ, ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అదే సమయంలో విశాఖపట్నం
నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు
ప్రమాదానికి గురైన బస్సును ఢీకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే డంపింగ్
యార్డ్ ఉండడం.. తెల్లవారుజామున అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టడంతో విపరీతంగా వెలువడిన పొగ కారణంగా డ్రైవర్లకు
రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దాంతో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి
ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హటాహుటిని దుర్ఘటనా స్థలానికి
చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరు
పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Monday, March 29, 2021
Bus accident near Visakhapatnam five passengers dead 30 injured
Friday, March 26, 2021
President Ramnath Kovind visits army hospital after experiencing chest discomfort
ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి
స్వల్ప అస్వస్థత కారణంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్మీ రిసెర్చ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. ఈమేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్ను వేయించుకున్నారు. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలోనే రామ్నాథ్ కోవింద్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. మార్చి 8న ప్రథమ మహిళ ఆయన సతీమణి సవితా కోవింద్ కు టీకా వేశారు.
Monday, March 22, 2021
Telangana CM KCR announced PRC 30% for govt. employees in assembly
తెలంగాణలో పీఆర్సీ పండుగ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్ దారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం ముందు హామీ ఇచ్చినట్లుగానే మున్నెన్నడు లేని రీతిలో ఫిట్మెంట్ ను 30 శాతం పెంచారు. అదే విధంగా ఉద్యోగ విరమణ వయోపరిమితిని 3 ఏళ్లకు పెంచుతూ 61ఏళ్లుగా నిర్ణయించారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఓయూ విద్యార్థులు మాత్రం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ సర్కార్ ను డిమాండ్ చేశారు.
Saturday, March 20, 2021
Uber announces free ride chance for covid-19 vaccination
ఉబెర్ ఆఫర్
ప్రముఖ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు తనవంతు సాయం ప్రకటించింది. టీకా వేయించుకునే వారికి ఉచితంగానే క్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఉచిత రైడ్ ఆఫర్ పొందొచ్చు. రూ.10 కోట్ల విలువైన ఉచిత రైడ్స్ ప్రజలకు అందించదలచింది. అయితే పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. ఇందులో రూ.50 లక్షల వరకు వయోవృద్ధులకు కేటాయించామని సంస్థ తెలిపింది. కరోనా టీకా బృహత్తర కార్యక్రమంలో ఉబెర్ ప్రభుత్వాలతో కలిసి పనిచేయనుంది.