హిందూపురం వాసులకు బాలకృష్ణ శుభవార్త
తెలుగు సినీ పరిశ్రమ అగ్ర కథానాయకుల్లో ఒకరు, హిందూపురం
ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా కష్టకాలంలో
ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విషయమై ఇటీవల
ఏపీఐఐసీ చైర్ పర్సన్ సినీ నటి రోజాతో మాట్లాడానన్నారు. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు
చెప్పారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ బాటలో హిందూపురం
ప్రగతికే ప్రాధాన్యమివ్వనున్నట్లు బాలకృష్ణ పునరుద్ఘాటించారు. బెంగళూరుకు హిందూపురం
దగ్గరగా ఉండడం నియోజకవర్గానికి కలిసివచ్చే అంశమన్నారు. `హిందూపురం సమీపంలో నాన్నగారు
(ఎన్టీఆర్) ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడను అభివృద్ధి చేద్దామని చెప్పా.. రోజమ్మ కూడా
తప్పకుండా చేద్దాం బాబూ` అన్నారని బాలకృష్ణ వివరించారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం ఏపీలో కూడా
చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.