ఏపీలో లాక్ డౌన్ స్పెషల్ పాస్ లు
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసుశాఖ స్పెషల్ పాస్ లు జారీ చేయనుంది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. మంగళవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మే 3వరకు మరో 19 రోజులు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలువుతోంది. రోడ్లపై పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అదే విధానం ఏపీలోనూ గడిచిన 21 రోజులుగా కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మండలాన్ని యూనిట్ గా తీసుకుంటూ రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ మండలాలున్న సంగతిని ఇటీవల ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు. రాబోయే కాలంలో దశలవారీగా లాక్ డౌన్ నిబంధనల సడలింపును కోరారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ప్రధాని లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక పాసులు మంజూరు చేస్తామని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. పాస్‌ల మంజూరు కోసం 13 జిల్లాల పోలీస్ శాఖ వాట్సాప్ నెంబర్లు, ఈ మెయిల్ వివరాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితిలో పాస్ కావాల్సిన వారు ఆధార్ కార్డు, పూర్తి వివరాలతో పాటు తమ సమస్యలను ఆయా జిల్లా పోలీస్ అధికారులకు వివరిస్తే వెంటనే పాస్ మంజూరు చేస్తారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. పాస్‌లను దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జిల్లాల వారీగా ఎస్పీ ఆఫీస్ ఫోన్ నంబర్లు
శ్రీకాకుళం-6309990933
విజయనగరం-9989207326
విశాఖపట్టణం(సిటీ)-9493336633
విశాఖపట్టణం(రూరల్)-9440904229
తూర్పుగోదావరి-9494933233
పశ్చిమగోదావరి-8332959175
కృష్ణా-9182990135
విజయవాడ(సిటీ)-7328909090
గుంటూరు(అర్బన్)-8688831568
గుంటూరు(రూరల్)-9440796184
ప్రకాశం-9121102109
నెల్లూరు-9440796383
చిత్తూరు-9440900005
తిరుపతి(అర్బన్)-9491074537
అనంతపురం-9989819191
కడప-9121100531
కర్నూలు-7777877722