Monday, April 13, 2020

CM KCR wears mask first time after state record first Covid case

తొలిసారి ముసుగులో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి మాస్క్ ధరించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితరాలపై ఆయన సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 1 హైదరాబాద్కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్కు కరోనా పాజిటివ్ వచ్చిన  నెలన్నర తర్వాత తొట్టతొలిసారి సీఎం కేసీఆర్ మాస్క్ ధరించారు. రాష్ట్రంలో ఇప్పటికే మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందేసర్జికల్ మాస్క్ధరించి వచ్చిన ముఖ్యమంత్రితో పాటు సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులైనా, పోలీస్ అధికారులైనా చేతులు సబ్బుతో కడుక్కున్న అనంతరం శానిటైజర్తో రబ్ చేసుకున్న తర్వాతే లోపలికి రావాలనే నిబంధన ప్రగతి భవన్ లో అమలు చేస్తున్నారు. ఇక సమీక్షా సమావేశం, కేబినెట్ భేటీ ఏదైనా సామాజిక దూరం పాటిస్తున్నారు. అనంతరం జరిగే ప్రెస్మీట్స్ లోనూ జర్నలిస్టులందరూ సామాజిక దూరం పాటించేలా కుర్చీలు దూరంగా వేస్తుండడం తెలిసిందే. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చే వారెవరైనా ముక్కు, నోటిని కప్పిఉంచేలా మాస్క్ ధరించాలని సర్కారు స్పష్టం చేసింది. మార్కెట్లో కొరత ఉంటే ఇంట్లోనే మాస్క్ తయారుచేసుకోవాలని, కనీసం కర్చీఫ్ (చేతి రుమాలు)నైనా వాడాలని సూచించింది.

Sunday, April 12, 2020

Super Star Mahesh Babu intresting tweet on quarantine time

సితారతో ఆడుకుంటున్న ప్రిన్స్ మహేశ్
వృత్తి, ప్రవృత్తి పరంగానూ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ శైలి పూర్తి క్రమశిక్షణతో కూడుకున్నది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలోనూ ఆయన అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఏమాత్రం తీరిక దొరికినా కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపే తెలుగు సూపర్ స్టార్ ప్రస్తుతం అదే అనుసరిస్తున్నారు. భార్యాపిల్లలతో  ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. క్వారంటైన్ టైమ్ని తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన ఫొటోతో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన గారాలపట్టీ సితారతో మహేశ్ ఆడుకుంటున్న ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. 'అందరూ ఇంట్లోనే ఉండండి.. సేఫ్గా ఉండండి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఫ్యాన్స్ ఫొటోతో పండుగ చేసుకుంటున్నారు. `ఇది చాలు' మాకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుండగా 'సరిలేరు నీకెవ్వరు' బిగ్గెస్ట్ హిట్ తో ఖుషీగా ఉన్న మహేష్ 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్దర్శకత్వంలో మూవీని ఫైనల్ చేయనున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Tuesday, April 7, 2020

Corona wavering at Gajuwaka area in Visakhapatnam

గాజువాకలో కరోనా కలకలం
విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో మంగళవారం కరోనా కలకలం చెలరేగింది. ఇక్కడ కుంచుమాంబ ఆలయం సమీపంలోని మాంసం దుకాణదారు కరోనా బారిన పడ్డాడు. అతను గత మూడ్రోజులుగా సుమారు 600 మంది వినియోగదారులకు మాంసం విక్రయించాడు. ప్రస్తుతం అతను కరోనా పాజిటివ్ అని తేలడంతో మాంసం కొనుగోలు చేసిన వారంతా హడలిపోతున్నారు. ప్రస్తుతం ప్రాంతానంతా అధికారులు దిగ్బంధనం చేశారు. అతని వద్ద ఆదివారం నుంచి మంగళవారం వరకు మాంసం కొనుగోలు చేసిన వ్యక్తులు ఇప్పటికే స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు ఆసుపత్రికి తరలివచ్చారు. 11 మంది కరోనా పరీక్షల కోసం రాగా మిగిలిన వారు వెంటనే తరలిరావాలని అధికారులు కోరుతున్నారు.

Sunday, April 5, 2020

Drone Split Hypo Chloride Medicine On Houses in Andhra Pradesh

డ్రోన్లతో కరోనాపై దండయాత్ర
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగర మునిసిపల్ అధికారుల వినూత్న రీతిలో కరోనాపై యుద్ధభేరి మోగించారు. భవానీపురం పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో మున్సిపల్ సిబ్బంది డ్రోన్ తో హైపో క్లోరైడ్ అనే యాంటీ కరోనా వైరస్ మందును ఇళ్లపై చల్లారు. కరోనా ప్రబలకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు కార్యక్రమం చేపట్టారు. ప్రతీ వీధిలో డ్రోన్ల సహాయంతో నివాసాలపై మందు పిచికారీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమాన్ని మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.