`వకీల్ సాబ్` ఫస్ట్ లుక్ వైరల్
పవర్ స్టార్
పవన్ కల్యాణ్ రాజకీయాలకు చిరు విరామమిచ్చి నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో
వైరల్ అవుతోంది. ముందు నుంచి అనుకున్న ఈ టైటిల్‌నే ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను
సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్
నటించిన ‘పింక్’ మూవీ బాలీవుడ్లో
సంచలన విజయాన్ని నమోదు చేసింది. తమిళ్ రీమేక్ లో `నెర్కొండ
పార్వాయ్`గా అజిత్ నటించారు. తెలుగు ‘పింక్’
రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే పింక్ సినిమాలో కథే
హీరో. కథనంలో పాత్రలే ప్రాణం. తమకు జరిగిన అన్యాయంపై ముగ్గురు యువతులు ఎలా
పోరాడారు? వాళ్లకు ఓ లాయర్ ఏవిధంగా సాయపడ్డారన్న ఎమోషనల్
బ్యాక్ డ్రాప్ తో నడిచే చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్
రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాని`ఎంసీఏ` చిత్రం ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం
వహిస్తున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని ఎప్పుడెప్పుడు తనివితీరా
చూసేద్దామా అని పవర్ స్టార్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా
టైటిల్ విషయమై విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ పలు తెలుగు సినిమాలు పూర్తి ఇంగ్లిష్, హిందీ టైటిల్స్
తో విడుదలైనవి ఉన్నాయి. పవన్ కల్యాణ్ అగర్భ మిత్రుడు మూవీ క్రిటిక్ కత్తి మహేశ్
ఎప్పటిలాగానే తెలుగు సినిమాకు టైటిల్ విషయంలో ఇదేమి భావ దారిద్ర్యం అని బాధను
వ్యక్తం చేశారు. పవనే ప్రధానంగా విడుదలైన ఫస్ట్ లుక్ పైనా పెదవి విరిచారు. అయితే పవర్ స్టార్ కు తనను పొగొడుతూ
చుట్టూ ఉండే అభిమానులు, స్నేహితులకంటే విమర్శకులంటేనే
అమితమైన ప్రేమ.