కశ్మీర్
లో శ్రీవారి ఆలయం!
కశ్మీర్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. సోమవారం విజయవాడలో జరిగిన కశ్మీర్ టూరిజం, కల్చర్ మీడియా సమావేశంలో స్థానిక
ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం
చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగానికి పెద్ద
పీట వేస్తున్నారన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా టూరిజానికి అవసరమైన అనుమతుల్నిచాలా
సులభతరం చేశారని విష్ణు వివరించారు. కశ్మీర్‌తో రాష్ట్ర పర్యటక రంగం
అనుసంధానం కావడం శుభపరిణామంగా ఆయన పేర్కొన్నారు. భూతల స్వర్గమైన కశ్మీర్, ఏపీ
టూరిజం పరస్పర అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని తమ ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ
ఇచ్చారు.