అంటార్కిటికా
మౌంట్ విన్సన్ మాసిఫ్ను అధిరోహించిన పూర్ణ
ఏడు ఖండాలలో ఉన్న ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్నదే భారతమాత ముద్దు బిడ్డ
మాలవత్ పూర్ణ లక్ష్యం. ఆ సాధనలో ఆమెకు మరో మెట్టు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా పూర్ణ అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్ను
జయించి 2019ను ముగించింది. ఈ ఘనత తరువాత ఇప్పటికి ఆమె ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన పర్వత శిఖరాలపై అడుగు పెట్టి
చరిత్ర లిఖించింది. ఈ కీర్తిని సొంతం చేసుకున్న ప్రపంచంలోనే తొలి గిరిజన మహిళగా 18 ఏళ్ల పూర్ణ నిలిచింది. మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా,
2014), మౌంట్ కిలిమంజారో
(ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017), మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019), మౌంట్ కార్ట్స్నెజ్ (ఓషియానియా, 2019), మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019) పూర్ణ అధిరోహించిన పర్వతాల జాబితాలో చేరాయి. 13 సంవత్సరాల 11 నెలల వయస్సులో ఆమె మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించింది. ప్రపంచంలోనే
ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు పూర్ణ.