వరల్డ్ కప్ భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
సెలెక్టర్లు
క్రికెట్ మక్కా ఇంగ్లండ్‌లో మే30 నుంచి ప్రారంభం కానున్న
ప్రపంచ్ కప్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం (ఏప్రిల్15) ప్రకటించింది.
ముంబయిలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘం సమావేశమైంది.
ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు. చర్చల అనంతరం 15 మంది సభ్యుల
జట్టును ప్రకటించారు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా రోహిత్
శర్మ వ్యవహరించనున్నారు. దినేశ్ కార్తీక్‌కు రిజర్వ్ వికెట్ కీపర్‌గా స్థానం లభించింది.
యువ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్(21)కు స్థానం దక్కలేదు. మ్యాచ్‌లో ధోనీ ఆడని
పక్షంలో ఆ స్థానాన్ని దినేశ్ కార్తీక్ చక్కగా భర్తీ చేయగలడని అతనిపై సెలెక్టర్లు భరోసా
ఉంచారు. సీనియర్టీతో పాటు లక్ష్య చేధన సమయంలో కూల్ గా బ్యాటింగ్ చేయడంలో దినేశ్
కార్తీక్ దిట్టని అతణ్ని ఎంపిక చేశారు. మిగిలిన సీనియర్ ఆటగాళ్లు సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్‌ల
ఎంపికను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయిదుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్,
ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు వికెట్ కీపింగ్ స్పెషలిస్టులు,
ఇద్దరు ఆల్ రౌండర్ల కూర్పుగా జట్టును ప్రకటించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ఎంపికలో
విజయ్ శంకర్ నిలవడం విశేషం. స్పెషలిస్ట్ కీపింగ్ బ్యాట్స్ మెన్ గా ధోని, దినేశ్
లు, ఆల్ రౌండర్లుగా జడేజా, హార్దిక్, మీడియం పేసర్లుగా షమీ,భువనేశ్వర్, బుమ్రాలు
టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా ధావన్, రోహిత్, రాహుల్, కోహ్లీ, విజయ్ శంకర్ జట్టుకు
ఎంపికయ్యారు.
భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్ ), రోహిత్ శర్మ (వైస్
కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్,
విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్,
జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.