కొత్త బ్రిడ్జి
మూసివేత
రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిని వారం రోజులపాటు మూసివేశారు. ఈరోజు
శుక్రవారం నుంచి మళ్లీ ఈనెల 21 వరకు ఈ బ్రిడ్జిపై రోడ్ ట్రాఫిక్ ను పూర్తిగా
నిలిపివేయనున్నారు. అత్యవవసర మరమ్మత్తులు చేపట్టడంతో రాజమండ్రి- కొవ్వూరు
మధ్య గల ఈ వారధిపై అన్ని ప్రయాణ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. 4.1 కిలోమీటర్లు
(2.5 మైళ్లు) పొడవైన ఈ బ్రిడ్జిపై ప్రతి అయిదేళ్లకోసారి
రోడ్డు భవనాల శాఖ విధిగా మరమ్మత్తులు చేపడుతోంది. దాంతో ఈసారి కూడా అన్ని ప్రయాణ
వాహనాలు; చిన్న, మధ్యతరహా రవాణా వాహనాల ట్రాఫిక్ ను ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లిస్తున్నారు.
ఇక భారీ రవాణా వాహనాలైన లారీలు, ట్రక్కులు మొదలైన వాటిని దివాన్ చెరువు జంక్షన్ రహదారిని
కలుపుతూ నిర్మించిన నాల్గో వంతెన మీదుగా మళ్లిస్తున్నారు. 1974 నుంచి గోదావరి
నదిపై అందుబాటులోకి వచ్చిన ఈ రోడ్ కం రైల్వే వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల
ప్రజల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరమైన రాజమండ్రి,
వాణిజ్య పట్టణం కొవ్వూరుల మధ్య రాకపోకలకు అనువుగా మారింది.