కేంద్రమంత్రి పోలవరం సందర్శన
*
సీఎం జగన్ తో కలిసి పునరావాస గృహాల
పరిశీలన
ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సందర్శించారు. శుక్రవారం ఉదయం సీఎం జగన్ తో కలిసి ఆయన ఇందుకూరిపేటలోని పునరావాస గృహాల్ని పరిశీలించి అక్కడ సౌకర్యాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం అన్ని విధాలా సహకారాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా షెకావత్ హామీ ఇచ్చారు. `పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది. కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాటకు మోదీ సర్కార్ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు పనుల పరిశీలనకు మధ్యలో మరోసారి పర్యటిస్తా`అని షెకావత్ తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం యావత్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఏర్పాటుకు చేయూతనిస్తామని కేంద్రమంత్రి మాట ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పునరావాస పనులపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారుల్ని సీఎం కోరారు.