సైనాను క్షమాపణలు కోరిన సిద్ధార్థ్
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ను దక్షిణాది సినీ హీరో సిద్ధార్థ్ క్షమాపణ వేడుకున్నారు. ఇటీవల తను చేసిన రీ ట్వీట్ కు సంబంధించి ఆయన సారీ చెప్పారు. ఈనెల 5న భారత ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై సైనా ట్వీట్ చేశారు. స్పందించి సిద్ధార్థ్ చేసిన రీ ట్వీట్ దుమారం రేపింది. దేశవ్యాప్తంగా నెటిజెన్లు సిద్ధార్థ్ కు స్త్రీద్వేషిగా ముద్ర వేసి ట్రోలింగ్ కు దిగారు. దాంతో దిగవచ్చిన ఈ హీరో సైనాను క్షమించాల్సిందిగా కోరుతూ మంగళవారం రాత్రి మరో ట్వీట్ చేశారు. తను నిజానికి గొప్ప మహిళావాదినని పేర్కొన్నారు. సైనా అభిప్రాయాలు చాలా వాటితో తను విభేదిస్తానని చెప్పారు. అయినా ఆమె తన చాంపియన్ అన్నారు. తన రీట్వీట్ లో ఉపయోగించిన పదాలు బాగాలేదన్నారు. హాస్యం కోసం తను ప్రయోగించిన భాష చక్కగా లేకపోయి ఉండొచ్చని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. ఆ రీ ట్వీట్ తప్పేనని ఒప్పకున్నారు. అందుకే ఈ మొరటు హాస్యానికి గాను సైనా తనను మన్నించాలని కోరారు.