Friday, December 11, 2020

US New president Joe Biden and Kamala Harris named Time Person of the Year

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

బైడన్..కమలా

అమెరికా తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్‌లను టైమ్స్ పత్రిక `పర్సన్ ఆఫ్ ది ఇయర్`‌గా ఎంపిక చేసింది.‌ నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను  డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ ఓడించిన సంగతి తెలిసిందే.‌ దాంతో ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ `పర్సన్ ఆఫ్ ది ఇయర్` తాజా జాబితాలో  బైడెన్, కమలాలకు అగ్రస్థానం దక్కింది. ఈ ఇద్దరు డెమొక్రాటిక్ నేతలు ముగ్గురు ఫైనలిస్టులను దాటుకుని ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఆంథోనీ ఫౌచీ, డొనాల్డ్ ట్రంప్ తదితరులు పోటీపడ్డారు. 78 ఏళ్ల బైడెన్, 56 ఏళ్ల కమలా ఫోటోలను కవర్ పేజీపై ముద్రించిన టైమ్ మ్యాగజైన్ `అమెరికా కథను మార్చారుఅంటూ  కింద ఉప-శీర్షికను పెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 232 ఓట్లు వచ్చాయి. అలాగే అమెరికా ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎవరికి సాధ్యం కానిరీతిలో బైడెన్ 70 మిలియన్లకు పైగా ఓట్లను సాధించారు. ఇంత వరకు 2006 ఎన్నికల్లో బారాక్ ఒబామా సాధించిన 6.9 మిలియన్ ఓట్లే అత్యధికం కాగా దానిని బైడన్ అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం విదితమే.

Thursday, December 10, 2020

Vijayashanthi satirical comments on KCR

కేసీఆర్ పై రాములమ్మ వ్యంగ్యోక్తులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాజాగా బీజేపీలో చేరిన రాములమ్మ (విజయశాంతి) వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ ను మించిన మహానటుడు లేరన్నారు. కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు విజయశాంతి చెప్పారు. ఉద్యమం కోసమే `తల్లి తెలంగాణ పార్టీ`ని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. మెదక్ ఎంపీగా ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన సంగతి గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని రాములమ్మ ఆరోపించారు. 

Sunday, November 29, 2020

Remote-controlled Robot Deployed at Egypt Hospital to Take Covid Tests, Warn Those Without Mask

ఈజిప్ట్ లో కరోనా కట్టడికి రోబో సేవలు

కరోనా సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో ఈజిప్ట్ లో రోబోల్ని రంగంలోకి దింపారు. మహమూద్ ఎల్-కోమి అనే ఆవిష్కర్త ఈ రిమోట్-కంట్రోల్ రోబోట్‌ను సిద్ధం చేశాడు. దాంతో ప్రస్తుతం అక్కడ ఆసుపత్రుల్లో ఈ రోబో సేవల్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. సిరా-03 అని పిలువబడే ఈ రోబోట్ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగలదు. రోగుల ఉష్ణోగ్రతను పరీక్షిస్తుంది. అదేవిధంగా మాస్క్ లు ధరించని వారిని హెచ్చరిస్తుంది. అచ్చం మనిషిలాంటి తల, మొహం, చేతులతో ఈ రోబోట్ ను తీర్చిదిద్దారు. ఈ మరమనిషికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వైద్యుల మాదిరిగా ఎకోకార్డియోగ్రామ్‌లు, ఎక్స్‌రేలు చేయగలదు. అంతేకాకుండా ఆ రిపోర్టు ఫలితాలను దాని ఛాతీకి అనుసంధానించిన తెరపై రోగులకు ప్రదర్శిస్తుంది. ఈ రోబోట్లను మనుషుల్లా రూపొందించడమెందుకంటే రోగులు భయపడకుండా ఉండడానికేనని మహమూద్ తెలిపాడు.

Wednesday, November 25, 2020

Diego Maradona dies, aged 60, after heart attack

సాకర్ మాంత్రికుడు మారడోనా కన్నుమూత

సాకర్ ప్రపంచంలో మాంత్రికుడిగా పేరొందిన అర్జెంటీనా అలనాటి మేటి ఆటగాడు డిగో మారడోనా ఆకస్మికంగా మృత్యు ఒడి చేరారు. అర్జెంటీనా వార్తాపత్రిక క్లారన్ కథనం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఫుట్‌బాల్ లెజెండ్ టైగ్రేలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. 60 ఏళ్ల మారడోనా తుదిశ్వాస విడిచే వరకు ఆయన శ్వాసధ్యాస సాకరే. అనారోగ్యం కలవరపెడుతున్నా ఫుట్ బాల్ క్రీడకు ఆయన దూరం కాలేదు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ అక్టోబర్ 30 న మారడోనా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పటికీ వివిధ సాకర్ క్లబ్ లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని లా ప్లాటాలో పట్రోనాటోను 3-0తో ఓడించిన గిమ్నాసియా జట్టుతో విజయానందంలో పాలుపంచుకున్నాడు. మెదడు శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి మారడోనా ను డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రాణాంతక గుండె పోటు ఆయనను బలితీసుకుంది. తన 21 సంవత్సరాల కెరీర్లో కనబర్చిన అద్భుత ఆటతీరుతో మారడోనాకు "ఎల్ పిబే డి ఓరో" ("ది గోల్డెన్ బాయ్") అనే మారుపేరు స్థిరపడింది. అర్జెంటీనాకు 1986 లో ప్రపంచ కప్ టైటిల్‌ అందించిన ఘనాపాఠి మారడోనా. 20 వ ఫిఫా ప్లేయర్‌గా పీలేతో పాటు, మారడోనా గౌరవం పొందాడు.  2010 ప్రపంచ కప్ సందర్భంగా అర్జెంటీనాకు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు.