ప్రజాదరణలో మోదీ, జగన్, మమతా
టాప్
దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతలుగా ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ, ఏపీ సీఎం
జగన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు వరుసగా
తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్‌ను ‘చెక్‌బ్రాండ్స్’ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. గడిచిన మూణ్నెల్ల కాలంలో 95 మంది టాప్ పొలిటీషియన్లు, 500 మంది అత్యున్నత
ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్ విశ్లేషించింది. సోషల్
మీడియాలో మోదీ హవా టాప్ గేర్ లో కొనసాగుతోంది. తర్వాత స్థానంలో జగన్, మమతాలు దూసుకువచ్చారు. ట్విటర్, గూగుల్ సెర్చ్,
యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్ మోదీ పేరుపైనే
ఉన్నాయి. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన గణాంకాల్ని ‘చెక్‌బ్రాండ్స్’
సంస్థ పరిగణలోకి తీసుకుంది.
10 కోట్ల ఆన్లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ తొలి
నివేదికను వెలువరించింది. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి
స్థానంలో ఉండగా స్వల్ప దూరంలో 2,137 ట్రెండ్స్‌తో జగన్ రెండో స్థానం కైవసం చేసుకున్నారు. మూడో స్థానంలో
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లు ఉన్నారు. బ్రాండ్ వ్యాల్యూ
విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ రూ. 336 కోట్లు కాగా ఆ తర్వాత స్థానాల్లో అమిత్ షా (రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (రూ. 328 కోట్లు) ఉన్నారు.