ఏపీలో కరోనాకు మరో జర్నలిస్ట్ బలి
కరోనా వైరస్ కు ఆంధ్రప్రదేశ్ లో మరో జర్నలిస్ట్
బలయ్యారు. ఓటీవీ చానల్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మధుసూధన్ రెడ్డి కరోనా
కారణంగా కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు
కోల్పోయారు. తిరుపతిలోనే ఈనెల 12న కరోనా తో పార్థసారథి అనే కెమెరామన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన శ్వాస
తీసుకోలేని పరిస్థితుల్లో మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ
ప్రాణాలొదిరారు. ఇప్పటికే తెలంగాణలో ఓ జర్నలిస్ట్ కరోనాకు బలయ్యారు. జూన్ లో మనోజ్ కుమార్ అనే టీవీ జర్నలిస్ట్ ని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది.