తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
ఆంధ్రప్రదేశ్ లో 80 రోజుల తర్వాత ఆలయాలు అన్నీ తెరుచుకున్నాయి.
సోమవారం అన్ని ప్రముఖ ఆలయాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా తిరుమలలో
స్వామి దర్శనం ప్రారంభమయింది. ఉదయం 11 గంటల వరకు ట్రయల్ రన్ నిర్వహించిన తిరుమల తిరుపతి
దేవస్థానం (టీటీడీ) 12 గంటలకు దర్శనానికి భక్తుల్ని అనుమతించింది. తిరుమలతో పాటు విజయవాడ,
సింహాచలం, అన్నవరం తదితర ఆలయాల్లోనూ ట్రయల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి
కనకదుర్గ ఆలయంలోకి భక్తుల్ని అనుమంతిచనున్నారు. అయితే మాస్కులు ధరించడం, శానిటైజేషన్
తప్పనిసరి అనే నిబంధనను కఠినంగా అమలు పరుస్తున్నారు. అదే విధంగా షాపింగ్ మాల్స్, హోటళ్లు
(తినుబండారాలు విక్రయించే) తెరుచుకున్నాయి. వినియోగదారుల్ని వీటిల్లోకి నిబంధనల మేరకు
అనుమతిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ అనంతరం ఇవి అందుబాటులోకి వచ్చిన తొలిరోజు కావడంతో
జనం పరిమిత సంఖ్యలోనే మాల్స్, హోటళ్లలో కనిపిస్తున్నారు.