సితారతో ఆడుకుంటున్న ప్రిన్స్ మహేశ్
వృత్తి, ప్రవృత్తి పరంగానూ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ శైలి పూర్తి క్రమశిక్షణతో కూడుకున్నది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలోనూ ఆయన అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఏమాత్రం తీరిక దొరికినా కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపే ఈ తెలుగు సూపర్ స్టార్ ప్రస్తుతం అదే అనుసరిస్తున్నారు. భార్యాపిల్లలతో ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. క్వారంటైన్ టైమ్‌ని తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన ఓ ఫొటోతో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన గారాలపట్టీ సితారతో మహేశ్ ఆడుకుంటున్న ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. 'అందరూ ఇంట్లోనే ఉండండి.. సేఫ్‌గా ఉండండి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఫ్యాన్స్ ఈ ఫొటోతో పండుగ చేసుకుంటున్నారు. `ఇది చాలు' మాకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుండగా 'సరిలేరు నీకెవ్వరు' బిగ్గెస్ట్ హిట్ తో ఖుషీగా ఉన్న మహేష్ 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మూవీని ఫైనల్ చేయనున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.