రాష్ట్రపతి కోవింద్
కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
భారత
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 74వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశంలో పలువురు
నాయకులు మంగళవారం ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి
ఎం.వెంకయ్యనాయుడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్
కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిజీకి జన్మదిన శుభాకాంక్షలు..దేశ
సేవలో అంకితమయ్యేందుకు ఆయనను దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలి..అని
ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జన్మదినం రోజున రాష్ట్రపతి వారణాసిలో విమానాశ్రయ
ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని
పరౌంఖ్ గ్రామంలో ఆయన 1 అక్టోబర్ 1945లో జన్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్
(ఎన్డీయే) అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన కోవింద్ యునైటెడ్
ప్రొగెసివ్ అలయెన్స్ (యూపీఏ) అభ్యర్థి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పై భారీ
ఆధిక్యంతో గెలుపొందారు. 2017 జులై25 న ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు
సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న ఆయన రాజకీయాల్లో చేరిన తర్వాత బిహార్ గవర్నర్ గా పనిచేశారు.