జూ.డా. ఆత్మహత్య కేసులో ముగ్గురు
డాక్టర్లకు కటకటాలు
కులం పేరుతో
వేధింపులకు పాల్పడి యువ వైద్యురాలి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు మహిళా వైద్యుల్ని ముంబయిలోని
ప్రత్యేక కోర్టు కటకటాల వెనక్కి నెట్టింది. 26 ఏళ్ల పాయల్ తద్వి అనే జూనియర్ డాక్టర్ ను డా.భక్తి
మెహర్, డా.హేమా అహుజా, డా.అంకితా ఖండేల్వాల్ తరచు వేధించేవారు. ఈ నేపథ్యంలో పాయల్
భరించలేక మే22న తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయారు. వీరంతా బీవైఎల్ నాయర్
ఆసుపత్రిలోనే పనిచేస్తున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన తద్వి రిజర్వేషన్ కోటాలో
సీటు సంపాదించినట్లుగా ఈ ముగ్గురు సీనియర్ మహిళా వైద్యులు ఆమెను మానసికంగా
వేధించేవారని తెలిసింది. నిందితులు ముగ్గురిపై ఎస్సీ,ఎస్టీ వర్గాలపై అకృత్యాల
నివారణ చట్టం, యాంటీ ర్యాంగింగ్ చట్టం, ఐ.టి.చట్టం, ఆత్మహత్యకు ప్రేరేపించడం (సెక్షన్
306) కింద కేసులు పెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ స్థానిక పోలీసులకు
కేసును అప్పగించొచ్చని వారి కస్టడీకి నిందితుల్ని ప్రశ్నించేందుకు అనుమతించాలన్న
అభ్యర్థనను అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్.ఎం.శద్రాణి తోసిపుచ్చారు. నిందితులకు జూన్
10 వరకు జ్యూడిషియల్ కస్టడీ కొనసాగించాలని తీర్పిచ్చారు.