అద్వానీ జోషీలను కలిసిన ప్రధాని మోదీ
తాజా లోక్ సభ ఎన్నికల్లో
మరోసారి అనూహ్య విజయాన్ని అందుకున్న ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీ
వ్యవస్థాపక, కురువృద్ధులైన నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను కలుసుకుని
ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడగా ఒక రోజు వ్యవధిలోనే బీజీపీ
అధ్యక్షుడు అమిత్ షా వెంట రాగా మోదీ శుక్రవారం(మే24) తన గురువు అద్వానీ, జోషిలను
వారి నివాసాలకు వెళ్లి కలుసుకుని విజయానందాన్ని పంచుకున్నారు. ఈ రోజు బీజేపీ విజయం
సాధించిందంటే అద్వానీజీ దశాబ్దాలుగా పార్టీ నిర్మాణానికి వేసిన పునాదులు, సాగించిన
కృషి ఫలితమేనని, తాజా ఆలోచనా విధానాన్ని ఆయన ప్రజల వద్దకు చేర్చారంటూ ట్వటర్ లో
మోదీ పేర్కొన్నారు. జోషి గురించి ట్వీట్ చేస్తూ మోదీ..ఆయన గొప్ప విద్యావంతుడు,
మేధావి.. భారతీయ విద్యా విధానంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. అహరహం
బీజేపీ పటిష్టతకు కృషి చేశారు..తనతోపాటు పలువురు కార్యకర్తల్ని ఆయన
తీర్చిదిద్దారని ప్రశంసించారు.