రన్ వే పై జారిన స్పైస్ జెట్..
ప్రయాణికులు సురక్షితం
షిర్డి విమానాశ్రయంలో సోమవారం (ఏప్రిల్ 29)
స్పైస్ జెట్ విమానం రన్ వే నుంచి పక్కకు జారింది. లాండింగ్ ప్రాంతం నుంచి 30-40 మీటర్లు ముందుకు దూసుకువెళ్లి ఆగింది. అయితే ఈ ఘటనలో
ప్రయాణికులకు, ఎవరికీ ఏ హాని జరగలేదు. దాంతో ఇతర విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం
ఏర్పడింది. హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన షిర్డీకి పెద్ద సంఖ్యలో భక్తులు
వస్తుంటారు. ఘటన అనంతరం స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ
ప్రయాణికులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూశామని చెప్పారు. ఈ విమానంలో ఎంతమంది
ప్రయాణికులున్నది, ఘటనకు గల కారణంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.