గౌతం గంభీర్ పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం
తాజాగా రాజకీయ నాయకుడి అవతారంలోకి మారిన క్రికెటర్ గౌతం
గంభీర్ అప్పుడే కేసుల్లో చిక్కుకుంటున్నాడు. ఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి
బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంభీర్ అనుమతి లేకుండా జంగ్పూర్ లో గురువారం (ఏప్రిల్
25) ఏర్పాటైన బహిరంగ సభలో పాల్గొన్నాడు. పెద్ద ఎత్తున రోడ్ షో కూడా నిర్వహించాడు.
దాంతో రిటర్నింగ్ ఆఫీసర్ కె.మహేశ్ బీజేపీ అభ్యర్థి గంభీర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు
చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి
అరవిందర్ సింగ్ లవ్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి అతిశ్ లతో గంభీర్ పోటీపడుతున్నాడు.
గంభీర్ కు ఓటర్ల జాబితాలో రెండు చోట్ల ఓట్లున్నట్లు కూడా ఆప్ అభ్యర్థి ఆరోపిస్తున్నారు.