లెక్చరర్ అపార్ట్మెంట్ లో విద్యార్థిని
బలవన్మరణం?
విశాఖపట్టణంలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (ఏప్రిల్ 16)న ఈ ఘటన వెలుగులోకి
వచ్చింది. జోత్స్న అనే ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థినికి ఎంసెట్ కోచింగ్ సమయంలో
లెక్చరర్ (బిహార్ కు చెందిన) అంకుర్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె సివిల్
ఇంజనీరింగ్ లో సీటు సాధించి సమీపంలోని కాలేజీలో చేరింది. అదే కాలేజీలో అంకుర్
కూడా లెక్చరర్ గా చేరాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అంకుర్ నివసించే
ఫ్లాట్‌కు జ్యోత్స్న వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న
ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనికి లెక్చరర్ అంకుర్ నిరాకరించడంతో దిక్కుతోచని
జ్యోత్స్న సోమవారం రాత్రి అతని ఫ్లాట్‌లోనే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి
పాల్పడినట్లుగా ప్రాథమికంగా కేసు నమోదయింది. అంకురే పోలీసులకు తొలుత సమాచారం
ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆమె ఉరి వేసుకుందని చెబుతున్న సీలింగ్ ఫ్యాన్ చాలా
ఎత్తులో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అంకురే తమ బిడ్డను హత్య చేశాడని ఆమె
ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని జోత్స్న తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారు.